బాల్యం

దందోలు చెన్నారెడ్డి 1833 వ సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన దందవోలు గ్రామం లో జన్మించారు. వారి బాల్యం అంత కూడా అదే గ్రామం లో గడిచింది. వారు ఆనాటి కాల మాన పరిస్థితులకు అనుగుణం గా విద్యాభ్యాసం చేసేరు. వారికి ఆ గ్రామానికి చుట్టుపక్కల చాల పొలాలు ఆస్తులు ఉండడం చేత చిన్నతనం నుండి విద్యాభ్యాసం తో పాటుగా వారి పొలాల పనులను కూడా ఎంతో ఓర్పుగా నేర్చుకునేవారు. వారు యుద్ధ విద్యలు కూడా ఎంతో నేర్పుగా అభ్యసించారు. పూర్వకాలం లో ప్రజలకు బందిపోతుల బెడద ఎక్కువగా ఉండేది. వారినుంచి తమ ఆస్తులను ధన మాన ప్రాణాలను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధం గా ఉండవలిసి వచ్చెది. ఈ కారణం గా అప్పటి యువకులందరూ తప్పనిసరిగా యుద్ధ విద్యలు నేర్చుకునేవారు. దందోలు చెన్నారెడ్డి గారు ఎంతో ధైర్య సాహసాలతో ఉండేవారు.

దందోలు చెన్నారెడ్డి గారికి ముగ్గురు సంతానం. ఒక కుమార్తె మరియు ఇద్దరు కుమారులు. కుమార్తె దందోలు నరసమ్మ మరియు కుమారులు దందోలు రామిరెడ్డి మరియు దందోలు సైఅప్పరెడ్డి.