తిరుగుబాటు

వారిని ప్రత్యక్ష యుద్ధం లో బంధించడం కష్టతరమని తెలుసుకున్న బ్రిటిష్ వారు కుట్ర పన్ని వేగులద్వార వారు సమీప గ్రామం మీద దండెత్తి వస్తున్నట్టు వర్తమానం పంపి చెన్నారెడ్డి గారు మరియు వారి అనుచరుల దృష్టి మళ్ళించి వారి గ్రామం లో ఉన్న పొలాలు ఆస్తులు అన్ని కొల్లగోట్టేసారు. అచ్చటి రైతులకు ఇదొక పెద్ద దెబ్బ. ఇలా ఆర్ధికం గా మరియు మానసికంగా స్థైర్యం కోల్పోయిన పోరాట వీరులు తర్వాత బ్రిటిష్ వారి కుట్ర కారణం గా ఒక్కొక్కరుగా వీరమరణం పొందారు.

ఒక్కనొక సమయం లో పోకురుపల్లి సమీపం లోని కొండలలో తలదాచుకున్న దందోలు చెన్నారెడ్డి ని ఒక అర్ధరాత్రి సమయం లో అన్యాయం గా దాడి జరిపి బంధించినట్టు అచ్చటి ప్రజానీకం ఈనాటికి చెప్పుకుంటుంటారు. వారిని బంధించి రెండు వైపులా రెండు రధాలు నడుపుతూ వారికి ఇనప గొలుసులు కట్టి చెరొక వైపు లాగుకుంటూ వూరి మధ్యలో వారిని బంధించిన బ్రిటిష్వారు తర్వాత పంచాయితీ జరిపించి వాద ప్రతి వాదనలు విన్నాక వారిని విడిచిపెట్టారని ఒక కథనం. ఇది ఇలా ఉండగా వారి మరణానికి సంబంధించిన వార్తలు ఏవి వివరంగా తెలియరాలేదు.