పాలనావిధానం

దందోలు చెన్నారెడ్డి రాపూరు మండలానికి సామంతరాజు గా ఉండేవారు. వారి ఆధీనం లో 11 గాములు ఉండేవి. వారు పోకురపల్లి లో నివసించేవారు. పోకురపల్లి గ్రామం నేటి నెల్లూరు జిల్లా లో వేంకటగిరి కి సమీపం లో ఉన్న చిన్న గ్రామం. చెన్నారెడ్డి గారు దేవి భక్తులు. వారు గ్రామా దేవత ఐన అంకమ్మ తల్లి మరియు లక్ష్మి దేవిలను పూజించేవారు. చేన్నరేడ్డిగారు వారి ప్రాంతాన్ని ప్రజారంజకం గా పరిపాలించేవారు. వారు ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేయించేవారు. వారి చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలకు మంచినీటి సదుపాయాలు కల్పించడానికి ఎన్నో బావులు, చెరువులు తవ్వించారు. ఆ చెరువులను ఇప్పటికి మనం కండలేరు డేం సమీపం లో చూడవచ్చు.

దందోలు చెన్నారెడ్డి అప్పటి పరిపాలకులైన వేంకటగిరి రాజైన మహారాజా రాజగోపాల కృష్ణ యాచేంద్ర వద్ద ఆదాయ మంత్రిగా కూడా వ్యవహరించేవారు.

దందోలు చెన్నారెడ్డి గారు వారి ప్రాంతం లో పేరుమోసిన పొగాకు రైతు మరియు వ్యాపారవేత్త. బ్రిటిష్ ప్రభుత్వం వారు తరచూ ప్రజలపై ఏదో ఒక కొత్త పన్ను వేసి వారి ఆదాయాన్ని తమ హస్తగతం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండేవారు. చేన్నరేడ్డిగారి సమయం లో బ్రిటిష్ వారు పొగాకు వ్యాపారాలపై కొత్త పన్నులు విధించడం వారు ఎంతగాను సహించలేకపోయారు. అప్పటి వ్యాపార కేంద్రం గా కర్నూల్ ఉండేది. చెన్నారెడ్డి గారి వ్యాపార వ్యవహారాలన్నీ వారి సహోదరి ఐన సావిత్రమ్మ చూసుకునేవారు. సావిత్రమ్మ ఎంతో చురుకైన మహిళ కావడం తో వారి వ్యపరవ్యవహారాలన్ని ఆమెకే అప్పచెప్పేవారు చెన్నారెడ్డి గారు. అదే సమయం లో మరొక పోరాట యోదుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తరచూ తమ ప్రాంత వ్యవహారలకోరకు కర్నూల్ వస్తూ ఉండేవారు. నరసింహారెడ్డి గారికి చెన్నారెడ్డి గారి ఆలోచన ధోరణి, ప్రజలకొరకు వారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రాంత ప్రజలలో వారికున్న పేరు ప్రతిష్టలు అన్ని ఎంతగానో ఆకట్టుకున్నై. వారిరువురూ మంచి మిత్రులుగా ఉంటూ తరచూ కలుస్తూ ఉండటం చేత ఆ సందర్భం లో వారి సహోదరి సావిత్రమ్మ గురించి కూడా బాగా తెలుసుకునే అవకాశం కలిగింది. సవిత్రంమగారి చురుకైన కార్య నిర్వహణ మరియు వారి ఆధునిక భావాలూ నచ్చిన ఉయ్యాలవాడ ఆమెను వివాహమాడేరు. ఆవిధం గా చెన్నారెడ్డి గారు నరసింహారెడ్డి గారికి బావమరిది అయ్యేరు.

చెన్నారెడ్డి గారు ఆ పిమ్మట బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి నిలబడాలనే నిర్ణయం తీసుకున్న సందర్భం లో వారి బావగారు ఐన నరసింహారెడ్డి వారికి ఎంతగానో సహకరించారని ఒక ప్రతీతి.